Krishna District: మైలవరంలో ఉద్రిక్తత.. పోలీసులపై చెప్పులు విసిరిన వైసీపీ కార్యకర్తలు.. లాఠీ ఛార్జ్!

  • మైలవరంలో నిర్వహించిన జగన్ బహిరంగ సభ  
  • పోలీసులు ఓవర్ యాక్షన్ చేశారన్న వైసీపీ నేతలు 
  • కార్యకర్తలకు గాయాలు 
కృష్ణా జిల్లా మైలవరంలో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. వైసీపీ బహిరంగ సభకు హాజరైన ఆ పార్టీ కార్యకర్తలు పోలీసులపై చెప్పులు విసిరారు. దీంతో, ఆందోళనకారులను అదుపు చేసేందుకు పోలీసులు లాఠీఛార్జి చేశారు. ఈ ఘటనలో వైసీపీ కార్యకర్తలు పలువురికి గాయాలయ్యాయి.

ఈ ఘటనపై వైసీపీ నేతలు స్పందిస్తూ, పోలీసులు ఓవర్ యాక్షన్ చేశారని ఆరోపించారు. తమ కార్యకర్తలకు చాలా మందికి గాయాలయ్యాయని అన్నారు. జగన్ సభకు హాజరైన స్థానికులను పోలీసులు ఈడ్చు కెళ్లారని, తమ రాష్ట్ర కార్యదర్శి తలశిల రఘురాంను నెట్టేశారని ఆరోపించారు.
Krishna District
mylavaram
YSRCP
police

More Telugu News