Nara Lokesh: అయ్యో, నా మనవడికి మంగళగిరి అని పలకడం కూడా రావడంలేదే!: లోకేశ్ పై లక్ష్మీపార్వతి సెటైర్

  • స్టాన్ ఫోర్డ్ నుంచి దొంగ సర్టిఫికెట్ తెచ్చుకున్నాడు
  • మంగళగిరిలో ప్రచారం
  • ఆళ్లకు ఓటేయాలంటూ ప్రజలకు పిలుపు
వైసీసీ నేత లక్ష్మీపార్వతి మంగళగిరి నియోజకవర్గంలో తమ పార్టీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డికి మద్దతుగా ప్రచారం చేశారు. మంగళగిరి మండలంలోని యర్రబాలెంలో రోడ్ షోలో ఆమె మాట్లాడుతూ, టీడీపీ అభ్యర్థి నారా లోకేశ్ పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తన మనవడికి మంగళగిరి అని స్పష్టంగా పలకడం కూడా రావడం లేదని సెటైర్ వేశారు.

తాను మంగళగిరి అని ఎంతో స్పష్టంగా పలుకుతున్నానని, కానీ మంగళగిరి అనడం లోకేశ్ వల్ల కావడంలేదని ఎత్తిపొడిచారు. తన మనవడు నారా లోకేశ్ కనీస జ్ఞానం లేని వ్యక్తి అని లక్ష్మీపార్వతి విమర్శించారు. చంద్రబాబు కొడుకు మీద ప్రేమతో రూ.60 కోట్లు ఖర్చుపెట్టి స్టాన్ ఫోర్డ్ యూనివర్శిటీ నుంచి దొంగ సర్టిఫికెట్ తెప్పించాడని ఆరోపించారు.

లోకేశ్ ను రాష్ట్రంలో ఎక్కడ నుంచి పోటీ చేయించాలో అర్థంకాక సింహం లాంటి ఆళ్ల రామకృష్ణారెడ్డితో పోటీకి దింపారని ఎద్దేవా చేశారు. ప్రజలందరూ ఆళ్లకే ఓటేయాలని ఈ సందర్భంగా లక్ష్మీపార్వతి మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Nara Lokesh
Chandrababu
Lakshmi Parvathi

More Telugu News