Athul Upadhyay: భార్యను డంబెల్‌తో కొట్టి చంపి.. తానూ ఆత్మహత్య!

  • బెంగుళూరులో ఉంటున్న అతుల్ దంపతులు
  • కేన్సరే కారణమని భావిస్తున్న పోలీసులు
  • ఇది స్వార్థం కాదంటూ సూసైడ్ లేఖ
తన భార్యను హత్య చేసి పెంపుడు కుక్కను టెర్రస్ పైనుంచి విసిరేసి తాను ఆత్మహత్య చేసుకున్నాడు ఓ భర్త. బెంగళూరులోని గాయత్రి విహార్‌లో ఈ దారుణం జరిగింది. అతుల్ ఉపాధ్యాయ అనే వ్యక్తి తన భార్య మమతను డంబెల్‌తో కొట్టి చంపేశాడు. అనంతరం తన పెంపుడు కుక్కను టెర్రస్ పైనుంచి కిందకు విసిరేసి తాను కూడా కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే అతుల్ వద్ద దొరికిన సూసైడ్ నోట్ ఆధారంగా ఈ ఘటనకు కేన్సరే కారణమని పోలీసులు భావిస్తున్నారు.

అయితే భార్యాభర్తల్లో ఎవరు కేన్సర్ తో బాధపడుతున్నారన్న విషయం మాత్రం తెలియరాలేదు. ‘‘కేన్సర్ చాలా ప్రమాదకరమైన వ్యాధి. కేన్సర్‌తో బాధపడడం కంటే ఇది మేలు. ఇది స్వార్థం కాదు’’ అని సూసైడ్ నోట్‌‌లో రాసి ఉన్నట్టు తెలు స్తోంది. బెంగళూరులో కలకలం రేపిన ఈ ఘటనపై పలు రకాల కథనాలు వినవస్తున్నాయి. అయితే అతుల్ దంపతులకు పిల్లలు లేరని, వారిద్దరూ పలు జబ్బులతో బాధపడుతున్నారని ఈ ఘటనకు ముందు వారిద్దరూ గొడవపడ్డారని వారితో కలిసి ఉండే వారి మేనల్లుడు పోలీసులకు తెలిపాడు.
Athul Upadhyay
Mamatha
Banglore
Cancer
Suicide

More Telugu News