Chandrababu: కేసీఆర్ వద్ద జగన్ కూలి పని చేస్తున్నాడు, సాయంత్రానికి రిపోర్ట్ చేస్తే డబ్బులిస్తాడు: చంద్రబాబు

  • ఉదయగిరిలో చంద్రబాబు విసుర్లు
  • కేసీఆర్ కు ఊడిగం చేయడానికి జగన్ సిద్ధపడ్డాడు
  • జగన్ ను నమ్మితే జైలే గతి
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు నెల్లూరు జిల్లాలో ఎన్నికల ప్రచారం కొనసాగిస్తున్నారు. ఉదయగిరిలో ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ, జగన్ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. జగన్ తెలంగాణ సీఎం కేసీఆర్ వద్ద కూలి పనిచేస్తున్నాడని మండిపడ్డారు. సాయంత్రానికి లోటస్ పాండ్ చేరుకుని, ఆపై కేసీఆర్ కు రిపోర్ట్ చేస్తే అప్పుడు ఆయన జగన్ కు డబ్బులిస్తాడని ఎద్దేవా చేశారు. జగన్, కేసీఆర్ ఇద్దరూ కలిసి ప్రజలను మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ కారణంగా ఎంతోమంది ఐఏఎస్ లు జైలుకు వెళ్లారని చంద్రబాబు విమర్శించారు. కోడికత్తి పార్టీని చూస్తే పారిశ్రామిక వేత్తలు పారిపోతారని వ్యంగ్యం ప్రదర్శించారు.

ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతున్న జగన్, అదే విషయాన్ని కేసీఆర్ తో మేనిఫెస్టోలో పెట్టించగలరా? అని సవాల్ విసిరారు. అదే సమయంలో, నెల్లూరు అర్బన్ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు సీరియస్ అయ్యారు. చంపడమా? చావడమా? అని వైసీపీ నేత అంటున్నారని, తాము ఎవరినీ చంపం, చంపనివ్వం అని స్పష్టం చేశారు. తప్పు చేస్తే జైలుకు పంపుతామని స్పష్టం చేశారు.
Chandrababu
Jagan
KCR

More Telugu News