Rajnath Singh: ఏపీలో జనంలేక వెలవెలబోయిన రాజ్ నాథ్ సభ

  • కృష్ణా జిల్లా అవనిగడ్డలో బీజేపీ సభ
  • హాజరయ్యేందుకు విముఖత చూపిన స్థానికులు
  • టీడీపీపై విమర్శలు చేసిన కేంద్ర హోం మంత్రి
కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కృష్ణా జిల్లా అవనిగడ్డలో కాలుమోపారు. అయితే, బీజేపీ అధినాయకత్వంలో నంబర్.3 గా వెలుగొందుతున్న రాజ్ నాథ్ కు అవనిగడ్డలో నిరాశ తప్పలేదు. ఆయన సభ జనంలేక వెలవెలబోయింది. ఇక తన సభలో ఆద్యంతం టీడీపీపై విమర్శలు చేయడానికే రాజ్ నాథ్ ప్రాధాన్యత ఇచ్చారు. ఐదేళ్ల పాలనలో టీడీపీ ప్రభుత్వం ప్రజల కళ్లల్లో మట్టికొట్టిందని విమర్శించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా తాము ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నామని తెలిపారు. అంతకుముందు ఆయన తెలంగాణలోని నిజామాబాద్ సభలో పాల్గొన్నారు.
Rajnath Singh
BJP

More Telugu News