Guntur District: జగన్ సభ ముగిశాక ప్రమాదం.. విద్యుదాఘాతంతో ఒకరు మృతి, మరొకరి పరిస్థితి విషమం!

  • గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో వైసీపీ సభ
  • విద్యుదాఘాతంతో ఒకరు మృతి, ఆరుగురికి గాయాలు
  • వృద్ధురాలు కృష్ణమ్మ పరిస్థితి విషమం
గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో వైసీపీ అధినేత జగన్ ఎన్నికల ప్రచార సభ ముగిశాక ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, ఆరుగురికి గాయాలు అయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు, జగన్ ప్రసంగించిన అనంతరం అక్కడే ఉన్న జనరేటర్ వద్ద విద్యుత్ షార్ట్ సర్య్యూట్ సంభవించింది. సమీపంలో ఉన్న ఆర్టీసీ కండక్టర్ సోమిరెడ్డి (45) అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఆరుగురికి గాయాలయ్యాయి. గాయాలపాలైన వారిలో మాచవరం మండలం మోర్జంపాడు గ్రామానికి చెందిన వృద్ధురాలు కృష్ణమ్మ ఉన్నారు. ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డ వారిలో ఓ బాలుడి పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉందని వైద్యుల సమాచారం. 
Guntur District
piduguralla
YSRCP
jagan

More Telugu News