Andhra Pradesh: ఏపీలో ‘ఫ్రీ అండ్ ఫెయిర్’ ఎలక్షన్స్ జరగకుండా కుట్రలు పన్నుతున్నారు: టీడీపీ ఎంపీ కనకమేడల
- టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నో అవకతవకలు జరిగాయి
- అదే రకమైన పద్ధతులతో ఏపీలో కుట్రకు యత్నం
- తెలంగాణ ప్రభుత్వంతో వైసీపీ కుమ్మక్కైంది
తెలంగాణలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నో అవకతవకలు చూశామని, అదే రకమైన పద్ధతులు ఎంచుకుని ఏపీలో ‘ఫ్రీ అండ్ ఫెయిర్’ ఎలక్షన్స్ జరగకుండా కుట్రలతో అధికారం చేజిక్కించుకోవాలన్న ప్రయత్నం జరుగుతోందని టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ అనుమానం వ్యక్తం చేశారు.
ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వాన్ని, టీఆర్ఎస్ పార్టీని సమర్థించే వ్యక్తులతో లేదా వారితో పొత్తులున్న వ్యక్తుల పట్ల ప్రజలు ఎంతో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఏపీలో ప్రధాన సమస్య జలవనరుల సమస్య అని, ఏపీపై, ఏపీలో ప్రాజెక్టుల విషయమై తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై దృష్టి సారించాల్సిన అవసరముందని అన్నారు. వైసీపీ వాళ్లు తెలిసి చేస్తున్నారో తెలియక చేస్తున్నారో గానీ తెలంగాణ ప్రభుత్వంతో కుమ్మక్కయ్యారని విమర్శించారు.