Ambika Krishna: పీతల సుజాతకు క్షమాపణలు చెప్పిన అంబికా కృష్ణ!

  • సుజాత గెలవలేదనే క్యాండేట్ ను మార్చారు
  • అంబికా కృష్ణ వ్యాఖ్యలతో నొచ్చుకున్న పీతల సుజాత
  • బాధపడివుంటే క్షమించాలన్న అంబికా కృష్ణ
తాను చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే పీతల సుజాత నొచ్చుకుని ఉంటే అందుకు క్షమాపణలు చెబుతున్నానని తెలుగుదేశం పార్టీ నేత అంబికా కృష్ణ వ్యాఖ్యానించారు. జంగారెడ్డి గూడెంలో జరిగిన ఓ సమావేశంలో ప్రభుత్వం నిధులు ఇచ్చినా, స్థానిక ఎమ్మెల్యే ఖర్చు చేయలేదని, మరోసారి ఆమె గెలవదన్న ఉద్దేశంతోనే మంచివాడైన డాక్టర్ కర్ర రాజారావును నిలిపామని చెప్పడంతో, సుజాత మీడియా ముందు కన్నీరు పెట్టుకున్న సంగతి తెలిసిందే.

ఎన్నికలకు ఇక వారం రోజుల సమయం మాత్రమే ఉండగా, పార్టీలో ఈ తరహా విభేదాలపై అధిష్ఠానం సీరియస్ కావడంతో అంబికా కృష్ణ క్షమాపణలు చెప్పారు. తాను నియోజకవర్గంలోని పరిస్థితిని ప్రస్తావిస్తూ ఆ వ్యాఖ్యలు చేశానని, ఎవరినీ నొప్పించే ఉద్దేశం తనకు లేదని, తన మాటలతో సుజాత బాధపడివుంటే క్షమించాలని కోరారు. పార్టీలో అందరమూ కలిసి పని చేస్తున్నామని అన్నారు.
Ambika Krishna
Sorry
Peetala Sujata

More Telugu News