lakshmis NTR: ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ విడుదలపై కోర్టు ఏం చెప్పబోతోంది? : నేడే తీర్పు

  • ఏపీలో విడుదలపై స్టే విధించిన హైకోర్టు
  • ఈరోజు సినిమాపై నిర్ణయం చెబుతామన్న న్యాయమూర్తి
  • స్టేపై సుప్రీం కోర్టుకు వెళ్లినా వర్మకు నిరాశే

తెలుగుదేశం పార్టీ అధినేత ఎన్టీఆర్‌ జీవితంలోకి లక్ష్మీపార్వతి ప్రవేశానంతర సంఘటనలపై సంచలన దర్శకుడు రామ్‌గోపాలవర్మ తీసిన ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ సినిమా ఏపీలో విడుదలపై హైకోర్టు ఏం చెప్పనుందన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. గతనెల 29వ తేదీన ఈ సినిమాను విడుదల చేసేందుకు నిర్మాత రాకేష్‌రెడ్డి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే ఏపీ సీఎం చంద్రబాబును నెగెటివ్‌ రోల్‌లో చూపినందున, ప్రస్తుత ఎన్నికల సమయంలో దాని ప్రభావం ఉండే అవకాశం ఉందని, అందువల్ల ఏపీలో విడుదలను నిలిపివేయాలని కొందరు హైకోర్టును ఆశ్రయించడంతో కోర్టు స్టే విధించిన విషయం తెలిసిందే. ఆ సందర్భంగా ఏప్రిల్‌ 3న సినిమాను చూసి తమ నిర్ణయం ప్రకటిస్తామని అప్పట్లో న్యాయమూర్తి ప్రకటించారు.

దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ చిత్ర నిర్మాత సుప్రీం కోర్టు తలుపుతట్టినా ‘ఎందుకంత తొందర?’ అంటూ ఓ మొట్టికాయవేసి హైకోర్టులోనే తేల్చుకోవాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని చూశాక న్యాయమూర్తులు సాయంత్రం 4.30 గంటకు తీర్పు ఇవ్వనున్నారు. ఈ తీర్పు ఎవరికి అనుకూలంగా ఉంటుందన్నదానిపై ఉత్కంఠ నెలకొంది.

More Telugu News