Lakshmis NTR: మ్యూజిక్ డైరెక్టర్ కల్యాణ్ మాలిక్ 'కుల వ్యాఖ్యల'పై పోలీసులకు ఫిర్యాదు!

షార్ట్స్‌లో చూడండి
'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా సంగీత దర్శకుడు కల్యాణ్ మాలిక్, తమ మనోభావాలను దెబ్బతీశారంటూ సగర (ఉప్పర) కుల సంఘం నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ప్రొద్దుటూరు టూ టౌన్ పోలీసులను కలిసిన సంఘం నాయకులు, కల్యాణ్ మాలిక్ పై కేసు నమోదు చేసి, చర్యలు తీసుకోవాలని కోరారు.

ఈ సినిమాపై ఓ ప్రైవేటు చానల్ లో జరిగిన సమీక్షలో పాల్గొన్న కల్యాణ్ మాలిక్, ఉప్పర కులస్థులను కించపరిచేలా మాట్లాడారని వారు ఆరోపించారు. సమీక్షలో 'ఉప్పరసోది', ఉప్పర పనికిమాలిన సోదీ' అంటూ మాట్లాడారని అన్నారు. ఉప్పర కులస్థులను తక్కువగా చేసి మాట్లాడిన ఆయన్ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. వారి ఫిర్యాదుపై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
Go Back to Shorts
Lakshmis NTR
Kalyani Malik
Police

More Telugu News