Tollywood: వర్మ మరో సంచలన ట్వీట్.. జూనియర్ ఎన్టీఆర్‌‌తోనే టీడీపీకి భవిష్యత్తన్న దర్శకుడు

  • అసలైన ఎన్టీఆర్ అభిమానులకు ఇదే నా విజ్ఞప్తి
  • ఆ సినిమాలో చంద్రబాబు పాత్ర చూశాకే ఓటెయ్యండి
  • నారా లోకేశ్ టీడీపీకి అసలైన వారసుడు కాదు
ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ మరో సంచలన ట్వీట్ చేశారు. జూనియర్ ఎన్టీఆర్‌తోనే టీడీపీకి భవిష్యత్తు అంటూ మరోమారు వేడి రాజేశారు. సీనియర్ ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు ఓ విజ్ఞప్తి అంటూ ట్వీట్ చేసిన వర్మ.. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలో చంద్రబాబు పాత్రను చూసిన తర్వాతే నిజాయతీపరులైన, అసలైన ఎన్టీఆర్ అభిమానులంతా ఓటు వేయాలని కోరారు. టీడీపీకి నారా లోకేశ్ వారసుడు కానేకాదని, తారక్ మాత్రమే అసలైన వారసుడని పేర్కొన్నారు. అతడితోనే టీడీపీకి భవిష్యత్తు అని స్పష్టం చేశారు.
Tollywood
Telugudesam
Nara Lokesh
Ramgopal varma
Chandrababu
Tarak
NTR

More Telugu News