Keerthi: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • మణిరత్నం చిత్రంలో అందాలతారకు ఛాన్స్ 
  • బాలీవుడ్ మెగాస్టార్ సరసన రమ్యకృష్ణ 
  • అభిమాన దర్శకుడితో మరోసారి సూర్య
 *  అందాలతార కీర్తి సురేశ్ కు మరో భారీ ఆఫర్ వచ్చింది. ప్రముఖ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో రూపొందుతున్న 'పొన్నియన్ సెల్వన్ చిత్రంలో నటించే ఛాన్స్ ఆమెకు వచ్చింది. ఇందులో యువరాణి కుందవాయ్ పాత్రను కీర్తి పోషిస్తుందట.
*  నిన్నటితరం కథానాయిక రమ్యకృష్ణ తాజాగా బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ సరసన ఓ చిత్రంలో నటించనుంది. అమితాబ్ తాజాగా 'ఉయరింద మనిథాన్' అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో ఆయన సరసన రమ్యకృష్ణను తీసుకుంటున్నారు.
*  తెలుగు, తమిళ చిత్రాల హీరో సూర్య తన ఫేవరైట్ దర్శకుడు బాలా దర్శకత్వంలో ఓ చిత్రం చేసే అవకాశం కనిపిస్తోంది. ఇటీవల బాల వినిపించిన కథ సూర్యకు నచ్చడంతో పూర్తి స్క్రిప్ట్ తయారుచేసుకుని రమ్మని చెప్పాడని సమాచారం. గతంలో వీరిద్దరి కలయికలో 'నంద', 'పితామగన్' వంటి హిట్ చిత్రాలు వచ్చాయి.
Keerthi
maniratnam
surya
Amitabh Bachchan

More Telugu News