KCR: డబ్బులకు ఆశపడే కాంగ్రెస్ నేతలు టీఆర్ఎస్‌లోకి వెళుతున్నారు: విజయశాంతి

  • కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో తెలియదా?
  • అసలైన తెలంగాణ ఇంకా రాలేదు
  • కేసీఆర్ మాటలు నమ్మొద్దు
కేసీఆర్ అబద్ధాల కోరు అని, సోనియా గాంధీ లేకపోతే కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యేవారా? అని కాంగ్రెస్ నేత విజయశాంతి ప్రశ్నించారు. కేసీఆర్‌కు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో తెలియదా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలైన తెలంగాణ ఇంకా రాలేదని, రానున్న రోజుల్లో కేసీఆర్‌కి ఓటు ఎందుకు వేశామా? అని అనుకోవద్దని సలహా ఇచ్చారు.  

కొంతమంది కాంగ్రెస్ నాయకులు డబ్బులకు ఆశపడి టీఆర్‌ఎస్ లోకి వెళ్తున్నారని విమర్శించారు. కేసీఆర్ మాటలు నమ్మకుండా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. 2014లో ఎర్రవెల్లిలో 34 ఎకరాలు మాత్రమే ఉండేదని, కానీ ఇప్పుడు వంద ఎకరాల భూమిని కొన్నారని ఆరోపించారు. రాహుల్ ప్రకటించిన కనీస ఆదాయ భరోసా పథకం ఎంతో మంచి పథకమని, దానిని ప్రకటించడం సంతోషంగా ఉందని విజయశాంతి వ్యాఖ్యానించారు. 
KCR
Vijayashanthi
Congress
Sonia Gandhi
Rahul Gandhi
Narendra Modi

More Telugu News