Mayavathi: మాయావతి కారు డోరు తీసి, ఆమె పాదాలకు నమస్కరించిన పవన్

  • విశాఖ వచ్చిన మాయావతి
  • ఏపీ, తెలంగాణలో ప్రచారం
  • రెండు రోజుల పాటు మాయావతి ప్రచారం
ఎన్నికల ప్రచారంలో భాగంగా బహుజన సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి నేడు విశాఖ పట్టణానికి వచ్చారు. మాయావతికి స్వాగతం పలుకుతూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆమె వచ్చిన కారు డోరు తీసి, ఆమె బయటకు రాగానే పాదాలకు మొక్కడం చర్చనీయాంశంగా మారింది. మాయావతి రెండు రోజుల పర్యటనకు జనసేన, బీఎస్పీ నేతలు సర్వం సిద్ధం చేశారు.

దీనిలో భాగంగా మూడో తేదీ ఉదయం పవన్‌తో కలిసి విశాఖలో మీడియా సమావేశంలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు  విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో జరగబోయే బహిరంగ సభకు విచ్చేస్తారు. 4వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు మాయావతి తిరుపతి శ్రీవెంకటేశ్వర యూనివర్సిటీ స్టేడియంలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. ఆ తరువాత సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్ ఎల్‌బీ స్టేడియంలో జరగబోయే బహిరంగ సభలో ఆమె ప్రసంగించనున్నారు.
Mayavathi
Pawan Kalyan
BSP
Janasena
Vijayawada
Hyderabad

More Telugu News