Nara Rohith: టీడీపీ తరుపున ప్రచారం చేయనున్న నారా రోహిత్.. షెడ్యూల్ ఖరారు

  • 3 నుంచి తొమ్మిదో తేదీ వరకూ ప్రచారం
  • 3న కొవ్వూరు, రాజమండ్రి, గోపాలపురం
  • 8, 9వ తేదీన చిత్తూరు జిల్లాలో ప్రచారం
టీడీపీ తరుపున సినీ కథానాయకుడు నారా రోహిత్ ప్రచారం చేయనున్నారు. ఆయన ప్రచారానికి సంబంధించిన షెడ్యూల్ ఇప్పటికే ఖరారైంది. ఈ నెల మూడో తేదీ నుంచి తొమ్మిదో తేదీ వరకూ రోహిత్ ప్రచారంలో పాల్గొననున్నారు.

మూడో తేదీన కొవ్వూరు, రాజమండ్రి, గోపాలపురం నియోజకవర్గాల్లో, నాలుగో తేదీన సత్తెనపల్లి, గుంటూరు, తణుకు, గురజాల నియోజకవర్గాల్లో, ఐదో తేదీన తెనాలి, రేపల్లె, పత్తిపాడులో, ఆరో తేదీన చీరాల, చిలకలూరిపేట, పర్చూరులో, ఏడో తేదీన ఉరవకొండ, పుట్టపర్తి, రాయదుర్గం, ఎనిమిది, తొమ్మిది తేదీల్లో చిత్తూరు జిల్లాలోనూ నారా రోహిత్ ప్రచారం చేయనున్నారని టీడీపీ వర్గాలు వెల్లడించాయి.  

Nara Rohith
Telugudesam
Kovvuru
Rajamundry
Tenali
Chittor
Guntur

More Telugu News