Arun Jaitly: ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చాం, ప్యాకేజీ పొందిన అనంతరం చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారు: అరుణ్ జైట్లీ

  • ప్రత్యేక ప్యాకేజీని చంద్రబాబు అంగీకరించారు
  • అభినందిస్తూ కేంద్రానికి లేఖ కూడా రాశారు
  • కాంగ్రెస్ డబ్బు ఎక్కడి నుంచి తీసుకు వస్తుంది?
ఆంధ్రప్రదేశ్‌కు ఇప్పటికే ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చామని, దానిని అంగీకరించడమే కాకుండా అభినందిస్తూ ఏపీ సీఎం చంద్రబాబు కేంద్రానికి లేఖ కూడా రాశారని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ  వెల్లడించారు. నేడు ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, ప్యాకేజీ పొందిన అనంతరం చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారని ఆరోపించారు.

ఆంధ్రప్రదేశ్‌కు చంద్రబాబు ఆమోదించిన ప్రకారం నిధులొస్తాయని జైట్లీ తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామంటూ కాంగ్రెస్ మేనిఫెస్టోలో హామీ ఇవ్వడంపై జైట్లీ మాట్లాడుతూ, హోదా కింద ఇచ్చే డబ్బును కాంగ్రెస్ ఎక్కడి నుంచి తీసుకు వస్తుందని ప్రశ్నించారు. ఇప్పటికే తమ తమ రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కావాలంటూ ఒడిశాతోపాటు అనేక రాష్ట్రాలు డిమాండ్ చేస్తున్నాయని జైట్లీ పేర్కొన్నారు.

Arun Jaitly
Chandrababu
Andhra Pradesh
Special Package
Congress

More Telugu News