Krishna District: చంద్రబాబు దుర్మార్గపు పాలన అంతం కావాలి: కొడాలి నాని

  • ఎన్నికల కోసమే చంద్రబాబు అబద్ధపు హామీలు
  • నమ్మిన వ్యక్తిని వెన్నుపోటు పొడిచే వ్యక్తి బాబు
  • వంగవీటి రంగాను హత్య చేసిన వ్యక్తి దేవినేని నెహ్రూ
ఏపీలో చంద్రబాబు దుర్మార్గపు పాలన అంతం కావాలని గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు. గుడివాడలో నిర్వహించిన వైసీపీ ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ, ఎన్నికల కోసమే చంద్రబాబు అబద్ధపు హామీలు ఇస్తున్నారని, గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేని బాబు ఇప్పుడేం చేస్తారు? అని ప్రశ్నించారు. నమ్మిన వ్యక్తిని వెన్నుపోటు పొడిచే వ్యక్తి చంద్రబాబు అని ఆరోపించారు. నాడు వంగవీటి రంగాను హత్య చేసిన వ్యక్తి దేవినేని నెహ్రూ అని, అటువంటి వ్యక్తి కుమారుడిని గుడివాడలో టీడీపీ తరపున నిలబెట్టారని విమర్శించారు.
Krishna District
gudivada
YSRCP
kodali
mla

More Telugu News