Chittoor District: భవిష్యత్ లో ఇంటర్ మీడియట్ నుంచే ‘నిరుద్యోగ భృతి’ ఇస్తాం: సీఎం చంద్రబాబు

  • నేను ఏం పని చేసినా పేదలను దృష్టిలో పెట్టుకుంటా
  • ఏపీలో ఎక్కడ చూసినా చంద్రన్నే కులం, టీడీపీనే మతం
  • కేసీఆర్ పంపిన పాపిష్టి డబ్బును తీసుకోవద్దు
భవిష్యత్ లో ఇంటర్ మీడియట్ పూర్తయిన తర్వాత నుంచే నిరుద్యోగ భృతి అందజేస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. చిత్తూరు జిల్లా చంద్రగిరిలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో చంద్రబాబు మాట్లాడుతూ, తాను ఏం పని చేసినా పేదలను దృష్టిలో పెట్టుకునే చేస్తానని, గర్భిణుల వైద్యం, మందుల ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని, రైతులకు శాశ్వతంగా పెద్దన్నగా ఉంటానని, వ్యవసాయానికి భవిష్యత్తులో 12 గంటలపాటు కరెంటు ఇస్తామని హామీ ఇచ్చారు. ఏపీలో ఎక్కడ చూసినా చంద్రన్నే కులం, టీడీపీనే మతం అనేలా ఉందని అన్నారు. ఈ ఎన్నికల్లో జగన్ కు మద్దతుగా ఉన్న కేసీఆర్ డబ్బులు పంపారని, వాటిని పంచాలని చూస్తున్నారని, ఆ పాపిష్టి డబ్బును తీసుకోవద్దని ప్రజలకు సూచించారు. 
Chittoor District
chandragiri
cm
Chandrababu

More Telugu News