chitoor district: జగన్ పేరులోనే ‘గన్’ ఉంది!: సీఎం చంద్రబాబు

  • ఒక్కసారి జగన్ ను గెలిపించాలట!
  • ఒక్కసారి తినే తిండిలో విషం కలుపుకుంటామా?
  • ఒక్కసారి కొండపైకెక్కి లోయలో దూకుతామా?
ఒక్కసారి తనను గెలిపించాలని ప్రజలను వైసీపీ అధినేత జగన్ కోరుతుండటంపై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఘాటుగా స్పందించారు. చిత్తూరు జిల్లా మదనపల్లెలో నిర్వహించిన టీడీపీ ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ, ఒక్కసారి తినే తిండిలో విషం కలుపుకుంటామా? కొండపై కెక్కి లోయలో దూకుతామా? అని ప్రజలను ప్రశ్నించారు. భావితరాల భవిష్యత్ కు సంబంధించిన అంశం పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. జగన్ పేరులోనే ‘గన్’ ఉందని, జగన్ కు ఎప్పుడూ నేరాలు, ఘోరాలు, కుట్రలేనని విమర్శించారు. ‘జగన్ మోహన్ రెడ్డికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయో తెలుసా? మోదీ, కేసీఆర్ నుంచి’ అని చెప్పారు.

హైదరాబాద్ నుంచి వలస పక్షులు వస్తున్నాయని, వలస పక్షులతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలు వైసీపీని నమ్ముకుంటే జైలుకు పోతారని, పవన్ పార్టీని నమ్ముకుంటే అత్తారింటికి పోతారని, అదే, తనను నమ్ముకుంటే ప్రజల భవిష్యత్ బ్రహ్మాండంగా తీర్చే బాధ్యత తనదని హామీ ఇచ్చారు. ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలన్నీ భర్తీ చేసే బాధ్యత తనదని అన్నారు. ఏపీలో ఉండే పత్రికా విలేకరులందరికీ ఇళ్లు కట్టిస్తామని మరోసారి స్పష్టం చేశారు.
chitoor district
cm
Chandrababu
YSRCP
jagan

More Telugu News