mohanbabu: తప్పుడు ప్రచారం చేస్తున్నారు.. నేను ఇంట్లోనే వున్నాను: మోహన్ బాబు

  • కొన్ని టీవీ చానళ్లు తప్పుడు ప్రచారం చేస్తున్నాయి
  • నేను నా ఇంట్లోనే ఉన్నా
  • ట్విట్టర్ ద్వారా స్పందించిన మోహన్ బాబు
చెక్ బౌన్స్ కేసులో ప్రముఖ సినీ నటుడు, వైసీపీ నేత మోహన్ బాబుకు ఏడాది జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. దర్శకనిర్మాత వైవీఎస్ చౌదరి ఈ కేసును వేశారు. మోహన్ బాబుకు జైలు శిక్ష పడిందనే వార్త సంచలనం రేపుతోంది. మరోవైపు దీనిపై మోహన్ బాబు ట్విట్టర్ ద్వారా స్పందించారు. 'కొన్ని టీవీ చానళ్లు నాపై చేస్తున్న తప్పుడు ప్రచారం గురించి ఇప్పుడే విన్నా. నేను నా ఇంట్లోనే ఉన్నా' అంటూ ట్వీట్ చేశారు.
mohanbabu
tollywood
cheque bounce
ysrcp

More Telugu News