hema: జనాల గుండెల్లో.. వారికి దగ్గరగా ఉండాలని ఉంది: సినీ హేమ

  • ప్రజాసేవ చేయాలనే కోరిక బలంగా ఉంది
  • పవర్ కావాలి.. ఏ పదవైనా సరే
  • రెండు నియోజకవర్గాలను ఎంచుకున్నా
సినీ నటి హేమ ఇటీవలే వైసీపీ అధినేత జగన్ ను కలిసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె మాట్లాడుతూ, తనకు ప్రజాసేవ చేయాలనే కోరిక బలంగా ఉందని... దానికి పవర్ కావాలని చెప్పారు. ఎమ్మెల్యేనో, ఎంపీనో కాదని... మరే పదవైనా సరేనని అన్నారు. జనాల గుండెల్లో, వారికి దగ్గరగా ఉండాలని ఉందని తెలిపారు. అందరూ స్టేజ్ మీద ఉంటే, తాను కింద ఉండలేనని చెప్పారు. భవిష్యత్తులో పోటీ చేసేందుకు తాను రెండు నియోజకవర్గాలను ఎంచుకున్నానని తెలిపారు.

తన కుమార్తె ప్రస్తుతం ఇంటర్ పరీక్షలు రాస్తోందని... వచ్చే ఏడాది డిగ్రీలోకి వెళ్తుందని హేమ చెప్పారు. తను పెద్దది అయిపోయిందని... తన అవసరం ఆమెకు లేదని... తాను పూర్తి స్థాయిలో ప్రజాసేవకు అంకితమవుతానని తెలిపారు. అందరూ తన విగ్రహాలు పెట్టుకునేంతగా ప్రజాసేవ చేస్తానని చెప్పారు.
hema
tollywood
politics
ysrcp

More Telugu News