budda venkanna: బుద్ధా వెంకన్న గారు... మనం ఒకరి ముఖం మరొకరు చూసుకోవాలి: మోహన్ బాబు

  • నోరుంది కదా అని ఊరికే పారేసుకోకండి
  • విమర్శలకు కూడా ఒక హద్దు ఉంటుంది
  • మా ఇంట్లో కూర్చొని మీరు ఏం మాట్లాడారో మరచిపోవద్దు
టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నపై సినీ నటుడు, వైసీపీ నేత మోహన్ బాబు ఫైర్ అయ్యారు. 'బుద్ధా వెంకన్న గారు నోరు ఉంది కదా అని ఊరికే పారేసుకోకండి. ఎన్నికలు ఉండేది ఇంకొక పది రోజులు మాత్రమే. ఆ తర్వాత మీరు మా ఇంటికి రావాలి. మేము మీ ఇంటికి రావాలి. ఒకరి ముఖం మరొకరు చూసుకోవాలి. ఎన్నికల్లో మమ్మల్ని మీరు విమర్శించవచ్చు. మిమ్మల్ని మేము విమర్శించవచ్చు. కానీ, దేనికైనా ఒక హద్దు ఉంటుంది. నెల రోజుల క్రితం మీరు మా ఇంట్లో కూర్చొని ఏం మాట్లాడారో మర్చిపోవద్దు' అంటూ ట్వీట్ చేశారు.

ఇటీవల బుద్ధా వెంకన్న మీడియాతో మాట్లాడుతూ, ఎవరు ప్యాకేజీ ఇస్తే వారి గురించి ఊసరవెల్లిలా మోహన్ బాబు మాట్లాడతారని తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. చంద్రబాబుపై బురద చల్లేందుకు మోహన్ బాబుకు ఎంత పారితోషికం అందిందో చెప్పాలని డిమాండ్ చేశారు. జగన్ కు పది రోజుల కాల్షీట్లు అమ్ముకున్నారంటూ విమర్శించారు. వీటన్నింటి నేపథ్యంలో, వెంకన్నపై మోహన్ బాబు ట్విట్టర్ ద్వారా స్పందించారు. 
budda venkanna
mohan babu
ysrcp
Telugudesam

More Telugu News