bhuma akhilapriya: అస్వస్థతకు గురైన భూమా అఖిలప్రియ

  • వడదెబ్బకు గురైన అఖిలప్రియ
  • గత రెండు రోజులుగా ప్రచారానికి విరామం
  • ఆరోగ్యం కుదుటపడగానే మళ్లీ ప్రచారం
ఏపీ మంత్రి, కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ టీడీపీ అభ్యర్థి భూమా అఖిలప్రియ అస్వస్థతకు గురయ్యారు. గత కొద్దిరోజులుగా ఆమె ఆరోగ్యం బాగోలేదు. అయినా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఎండ ఎక్కువగా ఉండటంతో ఆమె వడదెబ్బకు గురైనట్టు సమాచారం. దీంతో, గత రెండు రోజులుగా ఆమె ప్రచారానికి విరామం ప్రకటించారు. ఇంట్లోనే ఆమెకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఆరోగ్యం కుదుటపడగానే మళ్లీ ప్రచారాన్ని కొనసాగిస్తారని ఆమె అనుచరులు తెలిపారు. మరోవైపు, అఖిలప్రియ సోదరుడు భూమా బ్రహ్మానందరెడ్డి నంద్యాల నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో రెండు స్థానాల్లో విజయకేతనం ఎగురవేయాలని భూమా కుటుంబం ముమ్మరంగా ప్రచారం చేస్తోంది.
bhuma akhilapriya
allagadda
ill
Telugudesam

More Telugu News