జగన్ కు రూ. 1000 కోట్లు పంపించిన కేసీఆర్: దేవినేని ఉమ ఆరోపణ
- రిటర్న్ గిఫ్ట్ లో భాగంగా డబ్బు
- ప్రధానితో కలిసి రాష్ట్రంపై కుట్రలు
- పోలవరాన్ని ఒక్కసారైనా మోదీ సందర్శించారా?
- ఏపీ మంత్రి దేవినేని ఉమ
ఏపీ ప్రజలను అవమానించిన మోదీకి, జూలై నాటికి గ్రావిటీ ద్వారా పోలవరం నుంచి నీళ్లు అందించి చూపిస్తామని దేవినేని ఉమ చెప్పారు. ఏపీ సర్కారు ప్రాజెక్టు కోసం ఖర్చు చేసిన నిధుల్లో ఇంకా కేంద్రం నుంచి రూ. 4,483 కోట్లు రావాల్సి వుందని, రాష్ట్రాభివృద్ధిపై ఏ మాత్రం శ్రద్ధ ఉన్నా, తక్షణం ఆ నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర రైతుల అవసరాలను తీర్చే పోలవరం ప్రాజెక్టును ఆపాలని టీఆర్ఎస్ కేసులు వేసిన విషయాన్ని గుర్తు చేస్తూ, అటువంటి పార్టీతో జగన్ చేతులు కలిపారని విమర్శలు గుప్పించారు.