Samantha: కాలి నడకన తిరుమలకు నటి సమంత.. భక్తులతో కలిసి ఏడు కొండలు ఎక్కిన నటి

  • నేడు శ్రీవారిని దర్శించుకోనున్న మజిలీ చిత్ర బృందం
  • అందరూ కారులో కొండపైకి
  • సమంత మాత్రం కాలినడక.. సెల్ఫీలతో హోరెత్తించిన భక్తులు
టాలీవుడ్ టాప్ నటి సమంత తిరుమల శ్రీవారి దర్శనం కోసం కాలినడకన ఏడుకొండలు ఎక్కింది. నాగచైతన్య-సమంత జంటగా నటించిన మజిలీ సినిమా ఈ నెల 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో శ్రీవారి దర్శనం కోసం యూనిట్ తిరుమల చేరుకుంది. చిత్ర బృందం మొత్తం కారులో కొండపైకి చేరుకుంటే.. సమంత మాత్రం సామాన్య భక్తులతో కలిసి నడిచి కొండపైకి చేరుకుంది.

తమతోపాటు నడుస్తున్న భక్తులు సమంతను చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఆమెతో మాట్లాడుతూ, సెల్ఫీలు దిగుతూ సందడి చేశారు. అలా నడుస్తూ సరిగ్గా రాత్రి పది గంటలకు ఆమె కొండపైకి చేరుకుంది. నేడు చిత్రబృందం శ్రీవారిని దర్శించుకోనుంది. సమంత మెట్ల దారిలో కొండపైకి వెళ్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
Samantha
Tollywood
Naga chaitanya
Tirumala
Majili

More Telugu News