Nara Lokesh: ఏపీపై దండయాత్ర చేస్తున్న కాలకేయుడు మోదీ: లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్

  • రూ.54 వేల కోట్లు అవసరమైన పోలవరం ప్రాజెక్టుకు రూ.6 వేల కోట్లేనా?
  • ఆంధ్రులను తలెత్తుకునేలా చేస్తున్న చంద్రబాబు బాహుబలి
  • గుజరాత్‌లో నరమేధం చేసిన మోదీ భల్లాల దేవుడికి సరిసాటి
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు భల్లాల దేవుడు అంటూ ప్రధాని నరేంద్రమోదీ చేసిన వ్యాఖ్యలకు రాష్ట్రమంత్రి, మంగళగిరి టీడీపీ అభ్యర్థి నారా లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మోదీని కాలకేయుడితో పోల్చారు. గుజరాత్‌లో నరమేధం చేసిన మోదీ భల్లాల దేవుడికి సరిసాటని పేర్కొన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా దాడి చేస్తున్న కాలకేయుడు మోదీ అని తీవ్రస్థాయిలో విమర్శించారు.

కేంద్రం నుంచి ఏమాత్రం సాయం లేకున్నా ఆంధ్రులను తలెత్తుకునేలా చేస్తున్న బాహుబలి చంద్రబాబని లోకేశ్ అభివర్ణించారు. ఆంధ్రప్రదేశ్ హెరిటేజ్ చూసుకోవడానికి చంద్రబాబు, హెరిటేజ్ సంస్థను చూసుకోవడానికి బ్రహ్మణి, భువనేశ్వరి ఉన్నారని లోకేశ్ వివరించారు. రూ.54 వేల కోట్లు అవసరమైన పోలవరం ప్రాజెక్టు కోసం కేవలం రూ.6 వేల కోట్లు ఇచ్చి సరిపోవడం లేదంటే ఎలా? అని ప్రశ్నిస్తూ లోకేశ్ ఘాటుగా ట్వీట్ చేశారు.
Nara Lokesh
Narendra Modi
Telugudesam
Mangalagiri
Andhra Pradesh
BJP

More Telugu News