Chandrababu: జగన్ భల్లాలదేవుడు అయితే.. మోదీ బిజ్జలదేవుడు!: చిత్తూరులో చంద్రబాబు వ్యంగ్య వ్యాఖ్యలు

  • జగన్ ఓ విలన్
  • మోదీ ఓ నమ్మకద్రోహి
  • మమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరు
ఏపీ సీఎం చంద్రబాబునాయుడు  ఇవాళ సొంత జిల్లా చిత్తూరులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. చిత్తూరు పట్టణంలో నిర్వహించిన రోడ్ షోలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర విభజన అనంతరం డబ్బుల్లేకపోయినా ఆనందంగా, సంతృప్తికరంగా ఉన్నామంటే అది తన పాలన కారణంగానే అని అన్నారు. జగన్ అధికారంలోకి వస్తే ప్రతి ఊళ్లో దళారీ వ్యవస్థ తీసుకువస్తాడని ఆరోపించారు. తాను పసుపు-కుంకుమ చెక్కులు ఇస్తే అవి చెల్లవని కోడికత్తి పార్టీ చెబుతోందని చంద్రబాబు మండిపడ్డారు.

"నా చెక్కులు భేషుగ్గా చెల్లుతాయి కానీ, మీ నెత్తిన రూపాయి పెడితే పావలాకు దిక్కులేదు, మీరే చెల్లని కాసులు" అంటూ సెటైర్ వేశారు. జగన్ కరుడుగట్టిన ఫ్యాక్షన్ లీడర్ అని, జగన్ గెలిస్తే అది నేరస్తుల గెలుపు అవుతుందని, అంతిమంగా అది కేసీఆర్ గెలుపు అవుతుందని అన్నారు. జగన్ తమకు వద్దని పులివెందుల ప్రజలు కూడా చెబుతున్నారని చెప్పారు.

ఇక మోదీ గురించి మాట్లాడుతూ, తనను భల్లాలదేవుడు అనడం పట్ల దీటుగా బదులిచ్చారు. "ఆంధ్రప్రజలు బాహుబలి అయితే జగన్ భల్లాలదేవుడు. ఈ విలన్ కు తండ్రి కుట్రలు, కుతంత్రాలు చేసే బిజ్జలదేవుడు నరేంద్ర మోదీ. ఈ భల్లాలదేవుడు, బిజ్జలదేవుడు మనల్ని ఏమీ చేయలేరు. నాదే విజయం. ఈ ఎన్నికల యుద్ధంలో 25కి 25 సీట్లు గెలిచి చూపిస్తాం" అంటూ సవాల్ విసిరారు.
Chandrababu
Narendra Modi

More Telugu News