Hyderabad: బాంబులతో దద్దరిల్లే దేశం కావాలా? ప్రశాంతంగా ఉన్న ఇప్పటి భారత్ కావాలా?: ప్రధాని మోదీ

షార్ట్స్‌లో చూడండి
బాంబులతో దద్దరిల్లే దేశం కావాలా? ప్రశాంతంగా ఉన్న ఇప్పటి తరహా భారత్ కావాలా? అని ప్రధాని మోదీ  ప్రశ్నించారు. హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో బీజేపీ నిర్వహించిన విజయ సంకల్ప సభలో ఆయన మాట్లాడుతూ, యుద్ధ విమానాలు, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు కొనేందుకు డబ్బులు లేవని గత పాలకులు అనేవారని, మరి, మోదీ హయాంలో డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయంటూ కాంగ్రెస్ పార్టీపై సెటైర్లు విసిరారు. ఐదేళ్లు ఈ దేశానికి కాపలాదారుగా ఉన్నానని, ‘దేశానికి ఈ చౌకీదార్ రక్షణ కల్పిస్తారా లేదా అన్న విషయాన్ని మీరే ఆలోచించాలి’ అని ప్రజలను కోరారు. ఈ ఐదేళ్లలో అసాధ్యాలను సుసాధ్యం చేశామని మోదీ అన్నారు.
Go Back to Shorts
Hyderabad
LB
stadium
bjp
modi
TRS

More Telugu News