Telugudesam: సొంత వదినను కట్నం కోసం వేధింపులకు గురి చేశారు: వైసీపీ అభ్యర్థిపై ఎన్నికల సంఘానికి టీడీపీ నేతల ఫిర్యాదు

  • పోలీస్ కేసులను అఫిడవిట్ దాచి పెట్టారు
  • ఉమ్మడి ఆస్తులను రూ.38 కోట్లుగా చూపించారు
  • అనువంశిక ఆస్తులు చూపకపోవడంపై అభ్యంతరం
రాజమండ్రి నియోజకవర్గ వైసీపీ అభ్యర్థిపై టీడీపీ నేతలు నేడు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. వైసీపీ అభ్యర్థి మార్గాని భరత్ రామ్, తన అఫిడవిట్‌లో ఉమ్మడి ఆస్తులను రూ.38 కోట్లుగా చూపి, అనువంశిక ఆస్తులేవీ చూపకపోవడంపై టీడీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. తనపై ఉన్న పోలీస్ కేసులను అఫిడవిట్‌లో దాచి పెట్టారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేగాకుండా, ఆయన తన సొంత వదినను కట్నం కోసం వేధింపులకు గురి చేశారంటూ టీడీపీ ప్రధాన ఆరోపణ చేసింది.  తమ అభ్యంతరాలను పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని టీడీపీ నేతలు ఎన్నికల సంఘాన్న కోరారు.
Telugudesam
Bharath Ram
YSRCP
Police Case

More Telugu News