Butchaiah Chowdary: తెలుగు జాతిపై మోదీ తన ప్రతాపం చూపిస్తున్నారు: బుచ్చయ్య చౌదరి

  • మోదీ అంత అబద్ధాలకోరును చూడలేదు
  • రాజధాని కడతామని చెప్పి నిధులివ్వలేదు
  • జగన్‌కు డబ్బులు పంపించారు
  • హోదా పేరుతో కాలయపన చేస్తున్నారు
తెలుగు జాతిపై ప్రధాని నరేంద్ర మోదీ తన ప్రతాపం చూపిస్తున్నారని, బీజేపీ, వైసీపీ ఇద్దరూ ఒకటేనని టీడీపీ నేత బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ, మోదీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మోదీ అంత పచ్చి అబద్ధాలకోరును తానింత వరకూ చూడలేదని, రాజధాని కడతామని చెప్పి నిధులివ్వలేదని ఆరోపించారు. రూ.58 కోట్ల విలువైన పనులు రాజధాని ప్రాంతంలో జరుగుతుంటే... కేవలం రూ.1500 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకున్నారని ఆరోపించారు.

పోలావరానికి ఇచ్చే రూ.7 వేల కోట్లతో అది ఎప్పటికి పూర్తవ్వాలని ప్రశ్నించారు. చంద్రబాబును ఓడించేందుకు మాత్రం జగన్‌కు మోదీ డబ్బులు పంపించారని పేర్కొన్నారు. కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం కడుతున్న పన్నుల్లోనుంచే రాష్ట్ర వాటాగా నిధులిచ్చారని బుచ్చయ్యచౌదరి విమర్శించారు. హోదా పేరుతో కాలయాపన చేసి చివరకు ప్యాకేజీ అన్నారని, యూటర్న్ తీసుకున్నది చంద్రబాబు కాదని మోదీ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీకి ఏపీలో డిపాజిట్ కూడా రాదని దుయ్యబట్టారు.
Butchaiah Chowdary
Narendra Modi
Chandrababu
Telugudesam
Jagan

More Telugu News