Jana Sena: నా ఇంటి పేరు జేడీ కాదు.. అందరూ గమనించగలరు: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ విజ్ఞప్తి

షార్ట్స్‌లో చూడండి
ఇటీవలే జనసేన పార్టీలో చేరిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ విశాఖపట్నం లోక్ సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఆయన ఉద్యోగం నుంచి రిటైరైనా, గతంలో నిర్వర్తించిన జేడీ పదవిని ఇంటిపేరుగా చేర్చి 'జేడీ' లక్ష్మీనారాయణ అని పిలుస్తున్నారు. ఇప్పుడా 'జేడీ' అనే పదం తన కొంపముంచుతుందేమోనని ఆయన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే 'జేడీ' అనేది మీడియా అందించిన ఇంటి పేరు. కానీ ఆయన నిజమైన ఇంటిపేరు 'వీవీ'. ఈవీఎంలో కూడా 'వీవీ లక్ష్మీనారాయణ' అనే ఉంటుంది.

తన పేరును అందరూ 'జేడీ లక్ష్మీనారాయణ'గా భావించి ఈవీఎంలో కనిపిస్తున్న 'వీవీ లక్ష్మీనారాయణ' మరో వ్యక్తి అని పొరబడే ప్రమాదం ఉందని ఆయన భావిస్తున్నారు. అందుకే, ప్రచారంలో ముఖ్యంగా తన పేరు గురించి వివరిస్తున్నారు. తన పేరు 'వీవీ లక్ష్మీనారాయణ' అని, ఈవీఎంలో సీరియల్ నం.7లో గాజు గ్లాసు గుర్తుకు ఎదురుగా ఉంటుందని విడమర్చి చెబుతున్నారు.
Go Back to Shorts
Jana Sena

More Telugu News