యు-టర్న్ బాబుకు ‘పోలవరం’ ఓ ఏటీఎంలా మారింది: చంద్రబాబుపై మోదీ విమర్శలు
- ‘పోలవరం’ పూర్తి చేయాలన్న చిత్తశుద్ధి ఏపీకి లేదు
- కేంద్రం నిధులు మంజూరు చేసినా పూర్తి చేయలేదు
- బాబు పరిస్థితి ‘బాహుబలి’లో భల్లాలదేవుడిలా ఉంది
యు-టర్న్ బాబు పరిస్థితి ‘బాహుబలి’ సినిమాలో భల్లాలదేవుడిలా ఉందని మోదీ సెటైర్లు విసిరారు. తాము అధికారంలోకి వచ్చాక తొలి కేబినెట్ భేటీలోనే పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించామని, ఈ ప్రాజెక్టు కోసం ఇప్పటివరకు రూ.7 వేల కోట్లు విడుదల చేశామని స్పష్టం చేశారు. కేంద్రం నిధులు మంజూరు చేసినా ఇక్కడి ప్రభుత్వం ఈ ప్రాజెక్టును పూర్తి చేయలేదని విమర్శించారు. ‘పోలవరం’ అంచనా వ్యయాలు క్రమంగా పెరుగుతూ పోతున్నాయని అన్నారు.