Vijayawada: టీడీపీ ఐదేళ్ల పాలన రౌడీలను తలపించేలా సాగింది: వైసీపీ నేత మల్లాది

  • మళ్లీ టీడీపీకి ఓటేస్తే గూండాగిరి పెరిగిపోతుంది
  • దౌర్జన్యాలకు విజయవాడ కేంద్రంగా మారింది
  • ‘బొండా’ లాంటి వాళ్లు ఎమ్మెల్యేలయ్యాక రౌడీయిజం  పెరిగిపోయింది
టీడీపీ ఐదేళ్ల పాలన రౌడీలను తలపించేలా సాగిందని వైసీపీ నేత మల్లాది విష్ణు విమర్శించారు. అమరావతిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మళ్లీ టీడీపీకి ఓటేస్తే విజయవాడలో గూండాగిరి పెరిగిపోతుందని అన్నారు. దౌర్జన్యాలు, బెదిరింపులకు విజయవాడ కేంద్రంగా మారిందని, ఈ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తే సామాన్య ప్రజలు బతకలేరని ఆరోపించారు. ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ పై టీడీపీ గూండాలు దాడి చేయలేదా? అని ప్రశ్నించారు. ప్రజలను తప్పదోవ పట్టించేలా టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమా మాట్లాడుతున్నారని, ఉమా లాంటి వాళ్లు ఎమ్మెల్యేలు అయ్యాక రౌడీయిజం మరింత పెరిగిపోయిందని ఆరోపించారు. కల్తీ మద్యం కేసులో ఎక్సైజ్ శాఖ ఎఫ్ఐఆర్ లో తన పేరు లేకపోయినా అసత్య ఆరోపణలు చేస్తున్నారని, రాజకీయంగా ఎదుర్కోలేక ఇలాంటి కుట్రలు చేస్తున్నారని దుయ్యబట్టారు.
Vijayawada
YSRCP
malladi vishnu
Telugudesam
bonda

More Telugu News