YS Vijayamma: అప్పుడే భయపడలేదు నా కొడుకు... ఇప్పుడేం భయపడతాడు?: వైఎస్ విజయమ్మ

  • ప్రజల అభివృద్ధే జగన్ కు కావాలి
  • మంచి చేయాలని నిలబడ్డాడు
  • అందరూ ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలన్న విజయమ్మ
ఎన్నో కేసులు పెట్టి, జైల్లో పెట్టించి, ఆస్తులను అటాచ్ చేసుకున్నప్పుడే తన కుమారుడు జగన్ ఎవరికీ భయపడలేదని, ఇప్పుడు బీజేపీకి భయపడుతున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ వ్యాఖ్యానించారు. శ్రీకాకుళం జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆమె, "ప్రజల అభివృద్ధే జగన్ కు కావాలి. రాష్ట్రానికి మంచి చేయాలనే నిలబడ్డాడని చెబుతున్నా. ఈ రోజు ఎవరికీ లొంగే పరిస్థితి లేదు. ఎవరికీ భయపడే పరిస్థితి లేదని చెబుతున్నా. చంద్రబాబునాయుడు, కాంగ్రెస్ కలిసి ఎన్నో కేసులు పెట్టారు. సీబీఐ, ఐటీ రైడ్స్ చేశారు. అటాచ్ మెంట్లు... ఆస్తులు అటాచ్ మెంట్ చేశారు. అప్పుడే భయపడలేదు నా కొడుకు. ఇప్పుడేం భయపడతాడు?" అని ఆమె వ్యాఖ్యానించారు. రానున్న ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుపై ఓటేసి, జగన్ కు అఖండ విజయాన్ని అందించాలని ఆమె కోరారు.
YS Vijayamma
Jagan
Chandrababu
Congress
YSRCP

More Telugu News