Chandrababu: శత్రువులు కూడా ఇంత నష్టం చేయరు: మోదీ, షాలపై చంద్రబాబు నిప్పులు!

  • ప్రాంతాలు, మతాల పేరిట హింసను ప్రేరేపిస్తున్నారు
  • ప్రజలు తెలివిగా ప్రధానిని ఎన్నుకోవాలి
  • ఎన్డీయే చేసిన మోసాన్ని మరచిపోవద్దన్న చంద్రబాబు
నరేంద్ర మోదీ, అమిత్ షాల ద్వయం భారతదేశ శత్రువులు కూడా చేయనంత నష్టాన్ని చేస్తున్నారని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు నిప్పులు చెరిగారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో వరుస ట్వీట్లు చేశారు. భిన్నత్వంలో ఏకత్వం నిండిన దేశంలో, ప్రాంతాలు, మతాల పేరిట హింసను ప్రేరేపిస్తున్నారని ఆరోపించారు. గడచిన ఐదేళ్లలో ప్రజల మధ్య విభేదాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. "మోదీ కాకపోతే ఇంకెవరు? అని ప్రశ్నిస్తున్నారు. వారికి నేను చెప్పేది ఒకటే. దేశ ప్రజలు తమ ప్రధానిని తెలివిగా ఎన్నుకోగలరు. వారికి వారే రక్షకులు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని, ఎన్నికలను, భిన్నత్వంలో ఏకత్వాన్ని కోరుకునే ప్రజలు మోదీని తిరస్కరించాలి" అని ట్వీట్ పెట్టారు.

 "ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు వెళుతున్న వేళ, ఎన్డీయే చేసిన మోసాన్ని మరచిపోరాదు. ఎన్నో హామీలను వారు నెరవేర్చలేదు. చిన్నచూపు చూస్తూ, కేంద్రం నుంచి ఇవ్వాల్సిన మద్దతు ఇవ్వలేదు. మీ కోసం పోరాడుతున్న వారితో కలసి మీరూ పోరాడండి. అప్పుడే ఏపీకి న్యాయం జరుగుతుంది. భవిష్యత్తు భద్రంగా ఉంటుంది" అని మరో ట్వీట్ చేశారు.







Chandrababu
Twitter
Narendra Modi
Amit Shah

More Telugu News