pan card: పాన్ కార్డుతో ఆధార్ అనుసంధానం గడువు పెంపు

  • కేంద్రం తాజా నిర్ణయం
  • మరో 6 నెలలపాటు గడువు పెంపు
  • నాలుగు విధానాల్లో అనుసంధానం చేసే అవకాశం
ఐటీ రిటర్నులు దాఖలు చేయాలనుకునేవాళ్లు ఇకమీదట తమ పాన్ కార్డులను ఆధార్ తో తప్పనిసరిగా అనుసంధానం చేయాలని కేంద్రం కొన్నాళ్ల క్రితం ప్రకటన చేయడం తెలిసిందే. పాన్ తో ఆధార్ లింక్ చేయడానికి మార్చి 31వ తేదీని గడువుగా విధించారు. అయితే, ఇప్పుడా గడువును మరో 6 నెలలు పెంచారు. 2019 సెప్టెంబరు 30వ తేదీని కొత్త గడువుగా పేర్కొన్నారు. ఈ మేరకు కేంద్రం తాజా ప్రకటన జారీ చేసింది. పాన్ కార్డుతో ఆధార్ ను 4 పద్ధతుల్లో అనుసంధానం చేసుకునే వెసులుబాటు కల్పించారు.
pan card
aadhar

More Telugu News