Telangana: ‘తెలంగాణ’ రూపురేఖలే మార్చలేదు ఇంకా దేశం రూపు రేఖలెలా మారుస్తారు?: కేసీఆర్ పై విజయశాంతి సెటైర్లు

  • మోదీ మనిషి  కేసీఆర్
  • ఆ కేసీఆర్ వెంట జగన్
  • మోదీని ప్రజలు ఆదరించరు
లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో 16 ఎంపీ స్థానాల్లో టీఆర్ఎస్ ను గెలిపిస్తే, కేంద్రంలో చక్రం తిప్పుతామని, ప్రధానమంత్రి ఎవరో నిర్ణయిస్తామంటూ సీఎం కేసీఆర్ చేస్తున్న వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ప్రముఖ సినీ నటి విజయశాంతి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తెలంగాణ రాష్ట్ర రూపురేఖలే మార్చలేకపోయిన కేసీఆర్, ఇక భారతదేశం రూపు రేఖలు మారుస్తారనడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. మోదీ మనిషి  కేసీఆర్ అని, ఆ కేసీఆర్ తో ఉంది జగన్ తప్ప ఇంకెవ్వరూ లేరు కనుక, ఆయన చెప్పేవన్నీ అబద్ధాలేనని అన్నారు. ఐదేళ్ల బీజేపీ పాలనలో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారని, ఏ రకంగా చూసిన మోదీని ప్రజలు ఆదరించరని, కాంగ్రెస్ కు పట్టం కట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
Telangana
kcr
cm
Congress
vijayashanthi

More Telugu News