Jagan: ఆడపడుచులకిచ్చే పసుపు - కుంకుమను కూడా జగన్ అవమానించడం సిగ్గుచేటు: కళా వెంకట్రావు

  • డ్వాక్రా సభ్యులను అప్పులపాలు చేశారు
  • మహిళలను టీడీపీ ఆడపడుచులుగా భావిస్తుంది
  • రాష్ట్రానికి దిక్సూచిగా మహిళా సంఘాలు
డ్వాక్రా సభ్యులను వైఎస్ రాజశేఖరరెడ్డి తన హయాంలో అప్పులపాలు చేశారని ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు విమర్శించారు. నేడు ఆయన డ్వాక్రా మహిళలకు బహిరంగ లేఖ రాశారు. ఆ లేఖలో పలు అంశాలను ప్రస్తావించారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆడపడుచులకు ఇచ్చే పసుపు - కుంకుమను కూడా అవమానించడం సిగ్గుచేటన్నారు. మహిళలను ఆడపడుచులుగా భావించే ఏకైక పార్టీ టీడీపీ అని తెలిపారు. రాష్ట్రానికి దిక్సూచిగా మహిళా సంఘాలను మలచినట్టు కళా వెంకట్రావు పేర్కొన్నారు.
Jagan
Kala Venkat Rao
Dwakra
Telugudesam
Ys Rajasekhar Reddy

More Telugu News