Andhra Pradesh: నీ దగ్గర డబ్బుల్లేకపోతే నన్నడగలేదా? రూ.10 కోట్లు కావాలో, నీకెంత కావాలో తీసుకో అని నేనలేదా?: కేసీఆర్ పై కేఏ పాల్ ఫైర్

షార్ట్స్‌లో చూడండి
కేసీఆర్ తెలంగాణకు మాత్రమే ముఖ్యమంత్రినన్న వాస్తవం గుర్తెరగాలని, పక్క రాష్ట్రాల్లో వేలుపెట్టడం మానుకోవాలని ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ నిప్పులు చెరిగేలా మాట్లాడారు. తన ప్రసంగంలో కేఏ పాల్ పలుమార్లు ఇంగ్లీషులో కూడా అనర్గళంగా మాట్లాడారు. కేసీఆర్ కు ఏపీ రాజకీయాలతో ఏంపని అని పాల్ నిలదీశారు. ఇవాళ ప్రత్యేకంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కు అవినీతిపరుడైన జగన్ తో కలవాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. కేసీఆర్, జగన్ ల మధ్య ఏంటి సంబంధం? అని నిలదీశారు.

"నువ్వూ, నీ కూతురు, నీ కొడుకు, నీ అల్లుడు, నీ బంధువులు, నీ ప్రియులు.. ఇంతేనా నీక్కావల్సింది? నీకసలు సిగ్గుందా? డబ్బుల్లేనప్పుడు వచ్చి నన్ను డబ్బులు అడగలేదా? రూ.10 కోట్లు కావాలో, ఇంకెంత కావాలో తీసుకో అని నేను అనలేదా? తారీఖులు కూడా చెబుతాను. దీని గురించి నోరు విప్పలేదు ఇంతవరకు. ప్రజలారా గమనించండి! ఈ అవినీతి పరులకు ఓటెయ్యొద్దు" అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
Go Back to Shorts
Andhra Pradesh
KCR

More Telugu News