Andhra Pradesh: పవన్ కల్యాణ్ శ్రీకాకుళం టూర్ లో అపశ్రుతి.. వాహనం నుంచి ఒక్కసారిగా పొగలు!

  • ఏడు రోడ్ల కూడలిలో ఘటన
  • అప్రమత్తమై పవన్ ను కిందకు దించిన సిబ్బంది
  • వేడి కారణంగానే పొగలు వచ్చినట్లు వ్యాఖ్య
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈరోజు పర్యటనలో భాగంగా శ్రీకాకుళం ఏడు రోడ్ల కూడలిలో పవన్ సభ సందర్భంగా అపశ్రుతి చోటుచేసుకుంది. పవన్ కల్యాణ్ వాహనంపై నుంచి ప్రసంగిస్తూ ఉండగానే ఒక్కసారిగా పొగలు వచ్చాయి. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది పవన్ కల్యాణ్ ను వాహనం నుంచి దించేశారు.

అనంతరం ఇంజిన్ ను ఆపేశారు. ఎండ వేడిమి కారణంగా ఇంజిన్ ఎక్కువగా వేడెక్కడంతోనే పొగలు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వాహనం కింద నుంచే పవన్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. కాగా, ఈ ఘటనలో ఎవ్వరికీ ఏమీ కాకపోవడంతో జనసేన నేతలు, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.
Andhra Pradesh
Srikakulam District
Pawan Kalyan
Jana Sena
Fire Accident

More Telugu News