achireddy: సినిమా పరిశ్రమలో అంతా ఒక్కటే...రాజకీయాలు వ్యక్తిగతం : నిర్మాత అచ్చిరెడ్డి

  • మమ్మల్ని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం బెదిరిస్తోందన్న మాట అవాస్తవం
  • ఎన్నికల్లో పోటీచేసే వారంతా మంచివారే
  • వారిలో జగన్‌ బెస్ట్‌ అన్నది నా అభిప్రాయం
సినిమా పరిశ్రమ వేరు, రాజకీయాలు వేరని, అ రెండింటినీ కలిపి చూడవద్దని నిర్మాత కె.అచ్చిరెడ్డి కోరారు. సినిమా పరిశ్రమలో అంతా ఒక్కటేనని, రాజకీయాల్లోకి వస్తే అవి వ్యక్తిగతం అని చెప్పారు. లోటస్‌ పాండ్‌లో ఆయన ఈరోజు మీడియాతో మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పరిశ్రమ పెద్దలను బెదిరిస్తున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. ఎన్టీఆర్‌, వైఎస్సార్‌లా జగన్‌ కూడా ప్రజల్లోకి వెళ్లి వారి సమస్యలు తెలుసుకున్నారని, అందువల్ల ఆయన ముఖ్యమంత్రి అయితే బాగుంటుందన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే వారంతా మంచివారేనని, వారిలో జగన్‌ బెస్ట్‌ అన్నది నా అభిప్రాయమని చెప్పుకొచ్చారు.
achireddy
lotuspond
TRS
jagan

More Telugu News