Jagan: ఒక్కసారని అడుక్కుంటే... లోయలో దూకుతారా? సైనైడ్ మింగుతారా?: చంద్రబాబు

  • జగన్ కు ఓటేస్తే రాష్ట్రం నాశనం
  • తండ్రికి అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని దోచుకున్నారు
  • అభివృద్ధి కావాలంటే టీడీపీ గెలవాలి
తనకు ఒక్కసారి అవకాశం ఇవ్వాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ చేస్తున్న ప్రచారంపై చంద్రబాబు మండిపడ్డారు. ఒక్కసారి అవకాశం... ఒక్కసారి అవకాశం అని అడుక్కుంటే చేసిన తప్పులు చూసి కూడా ఎవరైనా చాన్స్ ఇస్తారా? అని ప్రశ్నించారు. ఒక్కసారే ప్లీజ్ అంటే ఎవరూ క్రూరమృగం దగ్గరకు వెళ్లరని, ఒక్కసారేనని అడిగితే లోయలోకి ఎవరైనా దూకుతారా? అని ఆయన ప్రశ్నించారు. ఒక్కసారి సైనైడ్ తాగమంటే ఎవరైనా తాగుతారా? అని నిప్పులు చెరిగారు. వైఎస్ జగన్ కు ఓటేయడమూ అంతేనని, తండ్రికి అవకాశం ఇస్తే, ఓ రాష్ట్రాన్ని దోచేసుకున్నారని, ఇప్పుడు కొడుక్కు అవకాశం ఇస్తే జనాలను బతకనివ్వరని అభిప్రాయపడ్డారు. రాష్ట్రం అభివృద్ధి కావాలంటే, టీడీపీకి 150కి పైగా అసెంబ్లీ సీట్లు, 25 ఎంపీ సీట్లు రావాలని, ఆ మేరకు కార్యకర్తలు, నేతలు కృషి చేయాలని అన్నారు.
Jagan
Chandrababu
YSRCP

More Telugu News