Vijayasai Reddy: ప్రజల ఫోన్ కాల్స్, వాట్స్ యాప్ చాటింగ్ ను ట్యాప్ చేస్తున్న చంద్రబాబు: విజయసాయి రెడ్డి

  • ట్యాప్ చేయిస్తున్న చంద్రబాబు సర్కారు
  • ప్రజా సంక్షేమం గాలికి వదిలేశారు
  • వందల కోట్లతో పరికరాలు కొన్నారు
  • ట్విట్టర్ లో ఆరోపించిన విజయసాయి రెడ్డి
ఏపీలో ప్రజల ఫోన్ కాల్స్ వాట్స్ యాప్ చాటింగ్ ను ప్రభుత్వం ట్యాప్ చేస్తోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ఆరోపించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెడుతూ, "చంద్రబాబు ఐదేళ్ల పాలనలో ప్రజా సంక్షేమం గాలి కొదిలి ప్రజల ఫోన్ కాల్స్, వాట్సాప్ చాట్స్ ను ట్యాప్ చేస్తున్నారు. వందల కోట్లతో నిఘా పరికరాలు కొన్నారు. శ్రీలంక, మాల్దీవులు, మయన్మార్ లాంటి దేశాల స్థాయిలో ఏపీ ఇంటెలిజెన్స్ స్పయింగ్ గాడ్జెట్స్ సమకూర్చుకుంది.

ఐటిగ్రిడ్స్ అందులో భాగమే" అని అన్నారు. అంతకుముందు "ప్రభుత్వం నుంచి వేతనం తీసుకుంటూ చంద్రబాబు తొత్తులుగా పనిచేసినఇంటెలిజెన్స్ విభాగం వారందరి పైనా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కఠిన చర్యలుంటాయి. వందల కోట్ల వ్యయంతో ఆ శాఖ కొనుగోలు చేసిన నిఘా పరికరాలు, ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేసిందీ అన్నీ బయటపెడతాం" అని ఇంకో ట్వీట్ చేశారు.





Vijayasai Reddy
Twitter
Phone Tap

More Telugu News