Chandragiri: అర్ధరాత్రి కొట్టుకున్న టీడీపీ-వైసీపీ కార్యకర్తలు.. చంద్రగిరిలో ఉద్రిక్తత

  • తీవ్ర ఉద్రిక్తంగా  చంద్రగిరి
  • పరస్పర దాడిలో గాయపడిన ఇరు పార్టీల కార్యకర్తలు
  • పోలీసులకు ఇరు వర్గాలు ఫిర్యాదు
చిత్తూరు జిల్లా చంద్రగిరిలో వైసీపీ-టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. ఇరు వర్గాలు కర్రలతో దాడి చేసుకోవడంతో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. చంద్రగిరిలో ఇప్పటికే వైసీపీ-టీడీపీ మధ్య పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్నాయి. దీనికితోడు శనివారం అర్ధరాత్రి ఇరు వర్గాల మధ్య జరిగిన గొడవ దీనికి మరింత ఆజ్యం పోసింది. పినపాకం హరిజనవాడలో ఇరువర్గాల మధ్య మొదలైన చిన్పపాటి గొడవ క్రమంగా ముదిరి కర్రలతో దాడి చేసుకునే వరకు వెళ్లింది.

ఈ ఘర్షణలో ఇరు పార్టీలకు చెందిన కార్యకర్తలు గాయపడ్డారు. వెంటనే వారిని తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకున్నాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Chandragiri
Tirupati
YSRCP
Telugudesam
Andhra Pradesh

More Telugu News