MS Dhoni: ధోనీ ఫ్యాన్స్ కు కోపం తెప్పించిన గౌతమ్ గంభీర్!

  • సన్ రైజర్స్ తో మ్యాచ్ లో సెంచరీ చేసిన సంజూ శాంసన్
  • ది బెస్ట్ వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్ అన్న గౌతమ్
  • ధోనీని కాదనడంపై అభిమానుల ఆగ్రహం
రాజస్థాన్ రాయల్స్ కీపర్ సంజూ శాంసన్ సెంచరీ చేసినప్పటికీ, ఆ జట్టు విజయం సాధించలేదు. హైదరాబాద్ లో జరిగిన ఈ మ్యాచ్ లో 199 పరుగుల లక్ష్యాన్ని ఒక ఓవర్ మిగిలుండగానే సన్ రైజర్స్ ఛేదించింది. ఓడిపోయినా, 102 పరుగులు చేసిన సంజూను పొగడ్తలతో ముంచెత్తిన గౌతమ్ గంభీర్, "ది బెస్ట్‌ వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌ మెన్‌. ఈ విషయాన్ని సంతోషంగా చెబుతున్నాను. వరల్డ్ కప్ లో అతను నాలుగోస్థానంలో బ్యాటింగ్ చేస్తే బాగుంటుంది" అన్నారు. ఇక గౌతమ్ వ్యాఖ్యలపై ట్రోలింగ్ మొదలైంది. ధోనీని కాదని సంజూను 'ది బెస్ట్‌ వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌ మెన్‌' అనడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న ఫ్యాన్స్, గౌతమ్ ధోనీకి ఎప్పుడూ వ్యతిరేకమేనని, ఆయన ఏమన్నా బీసీసీఐ పరిగణనలోకి తీసుకోదని అంటున్నారు. ధోనీయే ఉత్తమ కీపర్ అని ప్రపంచమంతా అంటుంటే, గౌతమ్ కు అసూయని కామెంట్లు చేస్తున్నారు.
MS Dhoni
Gautam Ghambhir
Sanju Samson

More Telugu News