KTR: కేటీఆర్ రోడ్ షోలో అందరినీ హడలెత్తించిన ఇద్దరు యువకులు!

  • తాండూరులో ఘటన
  • ఒంటిపై పెట్రోలు పోసుకున్న యువకులు
  • పోలీసుల అప్రమత్తతో తప్పిన ముప్పు
లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ ప్రచారం ముమ్మరం చేసింది. టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవాళ తాండూరులో రోడ్ షో నిర్వహించారు. అయితే కేటీఆర్ ప్రసంగిస్తున్న తరుణంలో ఇద్దరు యువకులు చేసిన పని అందరినీ హడలెత్తించింది.  ఆ యువకులు తమ వద్ద ఉన్న పెట్రోలును ఒంటిపై పోసుకోవడంతో జనాలు కకావికలం అయ్యారు. వారు ఆత్మహత్యకు ప్రయత్నించడంతో రోడ్ షోలో తీవ్ర కలకలం రేగింది. అయితే పోలీసులు సకాలంలో స్పందించి, ఆ యువకులను నిలువరించారు. ఎందుకు ఇలా చేయాల్సి వచ్చింది? అని ప్రశ్నించగా, స్థానిక నేతలు తమ సమస్యలను పట్టించుకోవడంలేదని, అందుకే బలవన్మరణానికి పాల్పడాలని నిర్ణయించుకున్నామని తెలిపారు.
KTR
Telangana

More Telugu News