Pawan kalyan: 64 అంశాలతో కూడిన మేనిఫెస్టోను విడుదల చేసిన పవన్

  • గాజువాకలో రోడ్‌షో నిర్వహించిన పవన్
  • పాలకులంతా నిర్లక్ష్యం చేశారు
  • అగనంపూడిని రెవెన్యూ డివిజన్ చేస్తా
  • కాలుష్యం నుంచి విముక్తి కల్పిస్తా
జనసేన అధినేత పవన్ కల్యాణ్ 64 అంశాలతో కూడిన గాజువాక నియోజకవర్గ మేనిఫెస్టోను విడుదల చేశారు. నేడు తాను పోటీ చేస్తున్న గాజువాక నియోజకవర్గంలో రోడ్ షో నిర్వహించిన పవన్, అభిమానులు, కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. గాజువాక సమస్యలతో కొట్టుమిట్టాడుతోందని, పాలకులంతా దానిని నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు.

గాజువాకను అభివృద్ధి చేయాలనే దృక్పథంతో తాను ఆ నియోజకవర్గాన్ని ఎంచుకున్నానన్నారు. తమ పార్టీ గెలిచిన తరువాత అగనంపూడిని రెవెన్యూ డివిజన్ చేస్తానని పవన్ హామీ ఇచ్చారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం నిర్వాసితులకు న్యాయం చేస్తానని స్పష్టం చేశారు. గన్నవరం పోర్టు కాలుష్యం నుంచి ప్రజలకు విముక్తి కల్పిస్తానని హామీ ఇచ్చారు.
Pawan kalyan
Gajuwaka
Road Show
Gannavaram Port

More Telugu News