Ramakrishna Babu: ప్రచారంలో ప్రమాదం.. స్వల్ప గాయాలతో బయటపడిన టీడీపీ అభ్యర్థి

షార్ట్స్‌లో చూడండి
టీడీపీ అభ్యర్థికి తృటిలో పెను ప్రమాదం తప్పి, స్వల్ప గాయాలతో బయటపడ్డారు. విశాఖ జిల్లాలోని తూర్పు నియోజకవర్గానికి చెందిన టీడీపీ అభ్యర్థి రామకృష్ణబాబు నేడు తన కార్యకర్తలతో కలిసి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన అభిమానులు పెద్ద ఎత్తున బాణసంచా కాల్చారు. ఈ నేపథ్యంలో టపాసులు అక్కడే ఉన్న గ్యాస్ బెలూన్‌పై పడటంతో ఒక్కసారిగా అది పేలిపోయింది. ఈ ఘటనలో రామకృష్ణబాబుకు స్వల్ప గాయాలవడంతో ప్రథమ చికిత్స చేయించుకుని యథావిధిగా ప్రచారంలో పాల్గొన్నారు.
Go Back to Shorts
Ramakrishna Babu
Visakhapatnam District
Telugudesam
Baloon

More Telugu News