నేను కాకపోతే సినిమా యాక్టర్ చేస్తాడా?: పవన్ పై చంద్రబాబు సెటైర్

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై ముఖ్యమంత్రి చంద్రబాబు పరోక్ష విమర్శలు చేశారు. రాష్ట్ర అభివృద్ధి టీడీపీతోనే సాధ్యమని ఆయన అన్నారు. తాను కాకపోతే సినిమా యాక్టర్ అభివృద్ధి చేస్తాడా? అని ప్రశ్నించారు. రాష్ట్ర సమస్యలపై కోడికత్తి పార్టీకి, జనసేనకు అవగాహన లేదని అన్నారు. టీడీపీ సైకిల్ చైన్ ను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లాగేశారన్న పవన్ వ్యాఖ్యలకు సమాధానంగా... సైకిల్ చైన్ లాగేసే శక్తి కేసీఆర్ కు ఉందా? అని ప్రశ్నించారు. సైకిల్ జోరు పెంచితే బుల్లెట్ లా మారి కేసీఆర్ గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తుందని అన్నారు. 


More Telugu News