Tollywood: ప్రజలారా, వైసీసీ అధినేత జగన్ మీకు మేలు చేయడానికే వస్తున్నాడు: మోహన్ బాబు

  • జగన్ కు పరిపాలనా అనుభవం లేదని విమర్శిస్తున్నారు
  • అవకాశమిస్తేనే కదా అనుభవం వచ్చేది
  • ఎదుటివాడు బాగుంటే ఓర్వలేని వ్యక్తి చంద్రబాబు
ప్రజలారా, వైసీసీ అధినేత జగన్ మీకు మేలు చేయడానికే వస్తున్నాడు అని ఆ పార్టీ నాయకుడు, ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు అన్నారు. విజయవాడలో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జగన్ కు పరిపాలనా అనుభవం లేదని విమర్శిస్తున్నారని, అవకాశమిస్తేనే కదా అనుభవం వచ్చేది? అని అన్నారు.

ఈ సందర్భంగా సినీ రంగంలో తాను కొత్తగా అడుగుపెట్టినప్పుడు కూడా తనకు అనుభవం లేదని చెప్పిన దర్శకులే తనను పిలిచి ఎన్టీఆర్ వంటి గొప్పనటుల పక్కన నటించే అవకాశం కల్పించిన విషయాన్ని గుర్తుచేశారు. ఎదుటివాడు బాగుంటే ఓర్వలేని మనస్తత్వం చంద్రబాబుది అని విమర్శించారు.

ఒక మహానటుడు స్థాపించిన తెలుగుదేశం పార్టీని లాక్కున్నావని, చంద్రబాబు మాయలో పడి ఆయన వెంట వెళ్లి తప్పు చేశానని, ఆ విషయాన్ని తాను గతంలోనే ఒప్పుకున్నానని అన్నారు. చంద్రబాబు లాక్కున్న పార్టీ టీడీపీ అని, వైఎస్ జగన్ స్థాపించిన పార్టీ వైసీపీ అతనిదని చెప్పారు. ఏపీ సర్వనాశనం అయిపోతోందని, దాన్ని కాపాడటం కోసం కంకణం కట్టుకుని పోరాడుతున్న వ్యక్తి జగన్ అని ప్రశంసించారు.
Tollywood
mohanbabbu
YSRCP
jagan
Babu

More Telugu News